![]() |
![]() |
.webp)
జబర్దస్త్ కమెడియన్ వర్ష గురించి అందరికీ తెలుసు. సీరియల్ ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించిన వర్ష.. జబర్దస్త్ కమెడియన్ గా మంచిపేరు సంపాదించుకుంది. అలాంటి వర్ష-ఇమ్మానుయేల్ లవ్ ట్రాక్ గురించి బుల్లితెర మీద అందరికీ తెలుసు. ఐతే వర్ష రీసెంట్ గా కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చింది. "బిగ్ బాస్ లోకి రమ్మంటూ మూడు సార్లు నుంచి ఆఫర్ వచ్చింది. కానీ వెళ్ళలేదు ఎందుకంటే నేను వెళ్ళడానికి ఇంకా టైం ఉందేమో అనుకుంటున్నా. నేను గొడవలకు చాలా దూరంగా ఉంటాను. గొడవలు అంటే నాకు భయం.. ఎవరైనా నాతో గొడవపడితే నేను తిరిగి గొడవపడలేను. అందులోనూ నాకు వంట అంత బాగా రాదు.
అది చేయలేదు ఇది చేయలేదు అంటూ పరువు తీస్తారు అందుకే వెళ్ళలేదు. బహుశా నెక్స్ట్ సీజన్ కి వెళ్తానేమో..అప్పటికి నా మైండ్ సెట్ కరెక్ట్ గా ఉంటే అప్పుడు వెళ్తాను.. సీరియల్స్ లో ఇంక చేయను..షోస్ మాత్రమే చేస్తాను. నాకు అల్లు అర్జున్, నాగ చైతన్య అంటే ఇష్టం. వాళ్ళ మూవీస్ లో చిన్న రోల్ వచ్చినా నటిస్తాను. ఇమ్మానుయేల్ తో పెళ్లి విషయం గురించి ఎందుకు చెప్పాలి. పెళ్లి జరిగితే చూడండి...జరగకపోయినా చూడండి.. లైఫ్ లో ఎం రాసిపెట్టి ఉందో అదే జరుగుతుంది. నేను కొన్నేళ్ల నుంచి ఒకే రకమైన స్ట్రక్చర్ ఎలా మెయింటైన్ చేస్తున్నానంటే ఇంట్లో ఫుడ్ తింటాను..ఎప్పుడైనా బయట ఫుడ్ తింటాను..టెన్షన్ పడకుండా, ఓవర్ థింకింగ్ చేయకుండా హ్యాపీగా ఉంటాను. నా మీద ట్రోల్స్ వచ్చినప్పుడు మొదట్లో డిప్రెషన్ కి వెళ్లిపోయేదాన్ని.. తర్వాత అలవాటైపోయింది. మా పేరెంట్స్ కూడా మొదట్లో వద్దు అనే చెప్పారు. కానీ ఆ తర్వాత వాటిని దాటుకుని వచ్చేసాను. అలాంటి కామెంట్స్ కి ఇప్పుడు నేను స్మైలీ ఎమోజిస్ ని నేనే పెడతాను" అని చెప్పింది వర్ష. జబర్దస్త్ లో సుడిగాలి సుధీర్ - రష్మీ జోడి ఎంత హిట్ అయ్యిందో వర్ష-ఇమ్ము జోడి కూడా అంతే హిట్ అయ్యింది.
![]() |
![]() |